రాష్ట్ర బడ్జెట్‌పై అసెంబ్లీ కమిటీ హాల్లో కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్లమెంట్ రీసెర్చ్ స్టడీస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకూ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చారు. శాసనసభకు తొలిసారి ఎన్నికైన 84 మంది, రెండోసారి ఎన్నికైన 39 మందికి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకు జరిగే ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సదస్సు అనంతరం సీఎం అధ్యక్షతన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు.