ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా తలకోన సిద్దేశ్వర స్వామి ఆలయంలో ఓ ఘటన చోటుచేసుకుంది. కార్తీకమాసం సందర్భంగా తలకోన ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో గర్భగుడిలో పూజలు చేస్తే సంభావన ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంతో ఇద్దరు పూజారులు పోటీ పడ్డారు. ఈ రోజు పూజలు నిర్వహించే బాధ్యత తనదంటే తనదని గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇంతలో అక్కడున్న భక్తులు వచ్చి పూజారులను విడదీశారు.