ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ముంబైలో హై అలర్ట్ ఏర్పడింది. ఇప్పటికే స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కి పలు బెదిరింపులు రావడంతో అలర్ట్ అయిన పోలీసులు ఆయనకు భద్రత పెంచారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు కొందరు షారుఖ్‌ని టార్గెట్ చేశారు. ఇటీవల పోలీసులకే డైరెక్ట్ కాల్ చేసి షారుఖ్ ని చంపేస్తాం అని బెదిరించారు. రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. అయితే ఈ కేసులో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ కాల్ చేసింది ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ కి చెందిన ఫైజాన్‌గా గుర్తించారు. ఆయన వృత్తిరీత్యా లాయర్. దీంతో పోలీసులు అతని పట్టుకోవడానికి రాయ్‌పూర్ బయలుదేరారు. తాజాగా ఫైజాన్‌ని రాయ్‌పూర్ లోని తన ఇంటివద్ద అరెస్ట్ చేశారు. నిందితుడిపై బాంద్రా పోలీసులు భారత న్యాయ సంహితలోని 308(4), 351(3)(4) సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు.
Share