Current Date: 14 Nov, 2024

పెళ్లిపై ప్రభాస్ సంచలన కామెంట్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా చర్చకు వచ్చే అంశం ఏదైనా ఉందీ అంటే అది ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి గురించే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పెళ్లి కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ సినీ ఇండస్ట్రీ వేచి చూస్తుంది. ఎందుకంటే, ప్రభాస్ ఎవరిని, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎప్పుడు వివాహబంధంలోకి అడుగుపెడతారు? అని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, అంతా ప్రభాస్ పెళ్లి చూడాలని అంతగా ఆశపడుతుంటే.. పెళ్లి విషయంలో ప్రభాస్ ఇంకా కన్ఫ్యూజన్‌లోనే ఉన్నట్లుగా తాజాగా ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలే చెబుతున్నాయి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా.. చేసుకోకూడదా?’ అని ప్రభాస్ అన్నారంట.. అంటే అందులో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది కదా.. అయితే ఇదేదో సీరియస్ మ్యాటర్ అనుకుంటున్నారేమో.. అలాంటిదేమీ లేదు. అసలు ప్రభాస్ ఎందుకు ఇలా అన్నారంటే.. తాజాగా ఆయన ఈటీవీలో ప్రసారమవుతోన్న సిరివెన్నెల ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఇందులో సీతారామశాస్త్రి రాసిన పెళ్లి పాటల ప్రస్తావన వచ్చింది. ‘మనీ’ అనే సినిమా కోసం ఆయన ‘భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదర్‌.. భర్తగా మారకు బ్యాచ్‌లర్’ అనే పాట రాశారు. 

Share