విశాఖ మెట్రోల రైలుపై మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారభించనునున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి తెలిపారు. ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగా.. స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో రైల్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం ఫీజిబుల్ రిపోర్టు తయారు చేసి ఇవ్వమన్నారని.. 2015లో డీపీఆర్ తయారు చేసి ఇచ్చామని తెలిపారు. అప్పుడు మీడియం మెట్రో అన్నారని.. 2016లో పీపీపీ మాడల్‌లో చెప్పారన్నారు. న్యూ మెట్రో పాలసీ ప్రకారం ధరఖాస్తు చేయమని తరువాత చెప్పారని తెలిపారు. ఢిల్లీ మెట్రో అధికారులు విశాఖ, విజయవాడకు లైట్ మెట్రోను సిఫారస్సు చేశారన్నారు. గతంలో ఇచ్చిన టెండర్లను వైసీపీ ప్రభుత్వం 2019లో క్యాన్సిల్ చేసిందని అన్నారు. అప్పటి ప్రభుత్వానికి మెట్రో చేయాలనే ఉద్దేశమే లేదని విమర్శించారు. అయితే కేంద్రంతో మాట్లాడి కలకత్తా మోడల్‌లో మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకువవెళతామని స్పష్టం చేశారు.
Share