Current Date: 27 Nov, 2024

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.  అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నుంచి అనుమతి తీసుకున్న అనంతరం  రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక్క ఇంగ్లీషు పదం కూడా లేకుండా సభా వ్యవహారాలు నడిపించడం విశేషం. దాంతో ఆయనను సభ్యులందరూ అభినందించారు.  ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం రద్దు బిల్లు-2024ను ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన పట్ల సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి.  వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి" అంటూ అయ్యన్నపాత్రుడు పూర్తిగా తెలుగులో మాట్లాడారు. అందరూ అవును అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడమైనది అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.

Share