Current Date: 27 Nov, 2024

వర్షాలపై బిగ్ అప్ డేట్ రెండు రోజులు మాత్రమే

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో వారం రోజుల నుండి నిరంతరం కురుస్తున్న వర్షాలకు బ్రేక్ పడింది. ఇక రాగల 24 గంటల్లో అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది అని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా తీరం దాటడం తో వర్షాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ప్రస్తుతం దీని ప్రభావం రానున్న 24 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతున్నారు. గడిచిన 24 గంటల్లో బొబ్బిలి 5 సె.మీ , పాలకొండ , పార్వతిపురం 5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. రాష్ట్రంలో అధిక శాతం ఏలూరు , అల్లూరి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావంతో సుందర తీరం వెంబడి గాలులు 45 నుండి 50 కిలోమీటర్లు వేగంతో వీస్తున్నాయని అన్నారు. వాయుగుండం లేని కారణంగా సమీపా పోర్టులకు హెచ్చరికలు ఎత్తివేసినట్లు తెలిపారు.

Share