Current Date: 26 Nov, 2024

అక్కినేని వారి పెళ్లి వేదికగా ముస్తాబవుతున్న అన్నపూర్ణ స్టూడియో

నాగచైతన్య- శోభితల వివాహం  రాజస్థాన్‌లో జరుగుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వేదిక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోకు షిఫ్ట్‌ అయ్యిందని తెలిసింది. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ ప్రత్యేక పెళ్లి మండపం నిర్మిస్తున్నారట. దీని కోసం సినిమా రంగానికి చెందిన ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌  వర్క్‌ చేస్తున్నారట. డిసెంబరు 4న ఈ ఇద్దరి వివాహం జరగనుందని సమచారం. ఇప్పటికే నాగచైతన్య కొంత మంది స్నేహితులకు వెడ్డింగ్ ఇన్విటేషన్స్‌ను పంపించాడట. శోభిత దూళిపాళ ఇంట్లో కూడా ఇంతకు ముందే  పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Share