Current Date: 26 Nov, 2024

రిటైర్‌మెంట్ ప్రకటించిన భారత వికెట్ కీపర్

భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ తనకు చివరిదని ప్రకటించాడు. ఆఖరిసారిగా తన సొంత జట్టు బెంగాల్ తరపున ఆడుతున్నానని వెల్లడించాడు. నా క్రికెట్‌ ప్రయాణంలో ఈ రంజీ సీజన్ చివరిది. రిటైర్ అవడానికి ముందు రంజీ ట్రోఫీలో చివరిగా బెంగాల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ అద్భుతమైన నా క్రికెట్ కెరియర్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ మద్దతు నా కెరీర్‌లో చాలా ముఖ్యమైనది. ఈ సీజన్‌ను గుర్తుంచుకునేలా ముగిద్దాం. అని సోషల్ మీడియా పోస్ట్‌లో వృద్ధిమాన్ సాహా రాసుకొచ్చాడు. కాగా సాహా వయసు 40 సంవత్సరాలు. ఐపీఎల్‌లో కూడా పలు జట్లకు ఆడాడు.

Share