దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసు మొత్తం కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ కుట్ర అని ఆరోపించాడు. ఈ కేసులో తనను ఇరికించారని పేర్కొన్నాడు. సంజయ్ రాయ్‌ని సీల్దా కోర్టు నుంచి పోలీసు వ్యానులో తీసుకెళుతున్న సమయంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కుట్ర అంతా వినీత్ గోయల్దే. నన్ను ఇరికించాడని నేను మీకు చెబుతున్నానని సంజయ్ రాయ్ అన్నాడు. జిల్లా అడిషనల్, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ విచారణ జరిపారు. ఈ విచారణను కెమెరాలో రికార్డు చేశారు. కోర్టు గది తలుపులు మూసి ఉంచి విచారణ జరిపారు. కాగా భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 అంటే రేప్, సెక్షన్ 66తో పాటు అంటే మరణానికి కారణం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Share