Current Date: 26 Nov, 2024

సైబర్ క్రైమ్‌లో చిక్కుకున్న ఉద్యోగి.. నిమిషాల్లో ఇలా రూ.1.05 కోట్లని పోలీసులు రికవరీ

 హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకొని రూ.1.22 కోట్లు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు వేగంగా స్పందించి రూ.1.05 కోట్లను రికవరీ చేశారు. నిమిషాల వ్యవధిలోనే డబ్బులు తిరిగి అకౌంట్లలో జమ చేయించారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అయితో ఇటీవల బాధితుడికి సైబర్ మోసగాళ్లు ఓ లింక్‌ పంపించారు. తమ పేరుతో అకౌంట్ ఓపెన్ తెరిచి ఆన్‌లైన్ ట్రేడింగ్‌ చేస్తే కళ్లు చెదిరే లాభాలు వస్తాయని నమ్మించారు. దాంతో వారి మాటలు నమ్మిన సదరు వ్యక్తి.. చెప్పునట్లుగానే ఖాతా తెరిచాడు. పలు ధపాలుగా మొత్తం రూ.1.22 కోట్లు పెట్టుబడులు పెట్టాడు. అయితే లాభాలు చూపించకపోగా.. అసలు కూడా ఇవ్వకపోవటంతో బాధితుడు మోసపోయిన్నట్లు గ్రహించాడు. వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైం డీసీపీ కవిత నేతృత్వంలో సైబర్‌ క్రైం కంట్రోల్ టీం.. బాధితుడు డబ్బు ఏ అకౌంట్లకు వెళ్లిందో తెలుసుకొని ఆ బ్యాంకు అకౌంట్లను స్తంభింపజేశారు. ఆ అకౌంట్‌లోని రూ.1.05 కోట్లు ఫ్రీజ్‌ చేయించారు. అనంతరం ఆ డబ్బును బాధితుడి అకౌంట్‌లో జమ చేయించారు. 

 

Share