Current Date: 26 Nov, 2024

పిఠాపురంలో 12 ఎకరాలు కొన్న పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం ప్లాన్ ఏంటి?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ మరోసారి భూమిని కొనుగోలు చేశారు. ఈసారి ఆయన 12 ఎకరాలు భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ భూమి రిజిస్ట్రేషన్‌ను పవన్ కళ్యాణ్ తరఫున.. రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తోట సుధీర్‌ పూర్తి చేశారు. తోట సుధీర్‌ కొనుగోలు పత్రాలపై సంతకాలు చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే జులైలో మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఇప్పుడు తాజాగా 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. త్వరలోనే ఈ స్థలంలో ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ భూమి కొనుగోల చేసిన ప్రాంతంలో ఎకరం మార్కెట్‌ విలువ రూ.15-16 లక్షల మేర ఉంటుందని చెబుతున్నారు. తాజాగా ఆయన మరో 12 ఎకరాలు కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ భూమి విలువ ఎకరా రూ.20 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.. అంటే ఈ 12 ఎకరాల ధర రూ.2.4 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తారా..? 

Share