Current Date: 26 Nov, 2024

రెండోసారి పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్.. మళ్లీ డాక్టర్ వధువు

టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన క్రిష్.. సినీ కెరీర్‌లో సక్సెస్‌ అయిన క్రిష్ వైవాహిక జీవితం మాత్రం సాఫీగా సాగలేదు. క్రిష్ కొన్ని సంవత్సరాల ముందు రమ్య అనే వైద్యురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం వైభవంగా జరగడంతో టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. కానీ విభేదాల కారణంగా కొన్నాళ్లకే క్రిష్‌, రమ్య విడిపోయారు. రమ్య యూఎస్‌లో మరో పెళ్లి చేసుకుని సెటిల్‌ అయినట్లు తెలుస్తోంది. కానీ క్రిష్ మాత్రం ఒంటరిగానే ఉన్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు హైదరాబాద్‌కి చెందిన వైద్యురాలితో క్రిష్ వివాహం జరగనుందని, గతంలో ఆమెకి వివాహం అయిందని, కొన్ని కారణాల వల్ల భర్తతో ఆమె విడి పోయిందని తెలుస్తోంది. ఆమెకు 11 ఏళ్ల కుమారుడు సైతం ఉన్నాడని, ఇద్దరి వివాహానికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం అనుష్క హీరోయిన్‌గా క్రిష్ దర్శకత్వంలో 'ఘాటీ' సినిమా రూపొందుతోంది. షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. 

Share