మరో ఐదు రోజుల్లో అంటే మే 13వ తేదీ సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కొందరికి అనివార్య కారణాల వల్ల ఓటర్ ఐడీ కార్డు మిస్సవ్వడం, లేదా ఓటు వేసే సమయానికి ఐడీ కార్డు కనిపించకపోవడం జరగడంతో కంగారు పడుతుంటారు. అయితే ఓటర్ ఐడీ కార్డు లేకపోయినా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వచ్చే ఎలక్షన్స్‌లో మీరు పోలింగ్ బూత్‌కి వెళ్లేసరికి అక్కడ మీ ఓటు లేకపోయినా లేదా ఓటర్ లిస్ట్ లో మీ పేరు గల్లంతైనా, మీ ఓటరుకార్డుగాని, ఆధార్ గాని చూపించి సెక్షన్ 49ఏ క్రింద ఛాలెంజ్ ఓటు వేయొచ్చునని తెలిపారు. మీ ఓటు అప్పటికే వేరే ఎవరైనా వేసేసినట్లయితే, ధైర్యంగా టెండర్డ్ ఓటు అడగొచ్చు అన్నారు. ఏ బూత్‌లో అయినా 14% దాటి ‘‘టెండర్ ఓట్లు’’ పోలైతే, అక్కడ రీ-పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఈ మెసేజ్ రానున్న ఎన్నికల సమయానికి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని, అందరికీ షేర్ చేయండి అంటూ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అక్రమాలు అరికట్టడానికి పౌరులుగా మన వంతు బాధ్యతలను మనం నిర్వహిద్దామని తెలిపారు.