రెండేళ్ల క్రితం వచ్చిన మ్యాడ్ సినిమాని సీక్వెలైన మ్యాడ్ స్క్వేర్ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నటించిన ఈ మూవీని ఇప్పటికే ఓవర్సీస్‌లో చూసిన అభిమానులు ఎక్స్ వేదికగా రివ్యూ ఇస్తున్నారు. డీడీ, లడ్డు పాత్రలు మళ్లీ దుమ్మురేపాయని ఫస్టాఫ్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. కానీ.. సెకండాఫ్‌కు అంతగా రెస్పాన్స్ రావడం లేదని ట్వీట్లు బట్టి తెలుస్తోంది. సినిమా ప్రారంభం నుంచే సుమారు 30 నిమిషాలకు పైగా నాన్ స్టాప్‌గా నువ్వులు ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా డల్ అయిన ప్రతిసారి కామెడీ పంచ్‌లను ప్రేక్షకుల ముందుకు తెచ్చారట. ఫుల్ కామెడీగా ఉన్నప్పటికీ అక్కడక్కడా డల్ మూమెంట్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. గోవా ఎపిసోడ్ బాగా ఉంటుందని అనుకుంటే అది అంతగా వర్కౌట్ కాలేదని చెబుతున్నారు. లడ్డుగాడి కామెడీ బావుంది కానీ ఆశించిన మేరకు లేదని కొందరు డిసప్పాయింట్ అవుతున్నారు. ఫస్టాఫ్‌లో ఉన్నంత ఎనర్జీ సెకండాఫ్‌లో కనిపించదని చెబుతున్నారు. ఓవరాల్‌గా సినిమా యావరేజ్‌గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు.
Share