చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై 17 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు 196 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో చెన్నై 146 పరుగులకే పరిమితమైంది. ఈ గ్రౌండ్‌లో చివరిసారిగా 2008లో చెన్నైను ఓడించిన బెంగళూరు.. మళ్లీ 6,155 రోజుల తర్వాత ఇప్పుడు గెలుపును నమోదు చేసింది. మ్యాచులో తాము ఓడిపోవడానికి ఫీల్డింగ్ సరిగా చేయకపోవడమే కారణమని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అంగీకరించాడు. పిచ్‌పై 170 మంచి స్కోర్. బెంగళూరు 25 రన్స్ అదనంగా చేసింది. మా ఫీల్డర్లు కీలక సమయాల్లో క్యాచులు వదిలేశారు. పెద్ద టార్గెట్ ఛేజ్ చేస్తున్నప్పుడు కొంచెం భిన్నంగా బ్యాటింగ్ చేయాలి. ఆ ప్రయత్నంలోనే వికెట్లు కోల్పోయాం అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.
Share