ఓపెన్ ఏఐ సంస్థ చాట్‌జీపీటీలో ప్రవేశపెట్టిన యానిమేషన్ ఇమేజ్ ఫీచర్ Ghiblistyle సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. యూజర్లు తమకు నచ్చిన ఫొటోలను యానిమేషన్ స్టైల్‌లోకి మార్చుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గిబ్లీ స్టయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే.. తొలుత chat.openai.comలో న్యూ చాట్ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన ఇమేజ్‌ను అప్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం జనరేట్ ది ఇమేజ్ బటన్ క్లిక్ చేయగానే మీరు కోరుకున్న చిత్రం వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది ChatGPT Plus, Pro, Team తదితర సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీ ఫొటోని కూడా Ghiblistyleలో చూసుకోండి
Share