Current Date: 12 Mar, 2025

రఘురామకి కేబినెట్ హోదా.. ఏపీ చరిత్రలో ఫస్ట్ టైమ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు మరో గౌరవం లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘురామకృష్ణరాజుకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రఘురామకృష్ణరాజును ఇటీవలే డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు కేబినెట్ హోదా కూడా కల్పించారు. డిప్యూటీ స్పీకర్ పదవిలో కొనసాగినంత కాలం రఘురామకు కేబినెట్ హోదా వర్తించనుంది. కేబినెట్ హోదాకు అనుగుణంగా రఘురామకృష్ణరాజుకు ప్రోటోకాల్, సెక్యూరిటీ కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక డిప్యూటీ స్పీకర్‌కు కేబినెట్ హోదా కల్పించడం ఇదే తొలిసారని తెలిసింది. ఉండి అసెంబ్లీ టీడీపీ టికెట్‌ను అప్పటికే మంతెన రామరాజుకు కేటాయించినప్పటికీ చివరి నిమిషంలో మార్పులు చేసిన చంద్రబాబు నాయుడు.. రఘురామకృష్ణరాజును అక్కడి నుంచి బరిలోకి దింపారు. ఇక అధినేత నమ్మకాన్ని నిజం చేస్తూ రఘురామకృష్ణరాజు 50 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Share