Current Date: 12 Mar, 2025

నేడు బాపట్లలో పర్యటించనున్న చంద్రబాబు...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు బాపట్లలో పర్యటించనున్నారు. బాపట్లలోని మున్సిపల్ హైస్కూల్ లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో సీఎం పాల్గొంటారు. వ్యక్తిత్వ వికాసంతో కూడిన విద్యను విద్యార్థులకు బోధించడం, స్వీయ క్రమశిక్షణను నేర్పించడం వంటి అంశాలపై ఉపాధ్యాయులకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు. పాఠశాలల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులను చంద్రబాబు సత్కరించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బాపట్లలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్టు జిల్లా ఎస్సీ తుషార్ తెలిపారు.

Share