కాక్రోచ్ పార్టీపై బీజేపీ మరోసారి తన అక్కసుని వెళ్లగక్కింది. నీట్ లీక్‌పై ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నేతృత్వంలో జెన్‌జీ చేసిన నిరసనల దెబ్బకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాంతో కాక్రోచ్ పార్టీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. విమర్శలు వస్తున్నప్పటికీ జెన్-జీ యువతపై తాను చేసిన 'గట్టర్ జనరేషన్' (మురికి కాలువ తరం) కామెంట్స్‌పై వెనక్కి తగ్గేది లేదని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు దేశంలోని యువత మొత్తాన్ని ఉద్దేశించినవి కావని, కేవలం కొందరు వ్యక్తులను మాత్రమే ఉద్దేశించి అన్నానని ఆమె సమర్థించుకున్నారు. తమను తాము 'బొద్దింకలు' అని అభివర్ణించుకునే వారి గురించే తాను మాట్లాడానని కంగన పేర్కొన్నారు. బొద్దింకలు మురికి కాలువల నుంచే వస్తాయని, అలాంటప్పుడు తాను అన్న మాటల్లో తప్పేముందని ప్రశ్నించారు. కొందరు తమను తాము బొద్దింకలుగా చెప్పుకుంటున్నప్పుడు, మురికికాలువే వారి ఇల్లు అంటే కోప్పడాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు.