జోయ్ జమీమా హానీ ట్రాప్ కేసులో ఫిర్యాదీ అజీమ్ ఖాన్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రాలో క్రిప్టో కాయిన్ పేరిట ఆజమ్ ఖాన్ ముఠా అనేక మోసాలు చేసినట్టు గుర్తించారు. తన దగ్గర 36 లక్షల రూపాయలు తీసుకొని తనను మోసం చేశాడని రతన్ రాజు ఇచ్చిన ఫిర్యాదు పై అజీమ్ ఖాన్ ను కంచరపాలెం పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణా పోలీసులు పీ టి వారెంట్ తీసుకొని అజీమ్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు.గోదావరిఖనిలో క్రిప్టో, వెల్సప్రో, జిల్కకాన్ కాయిన్ల పేరుతో రూ.44 లక్షలు కాజేసిన కేసులో ఈరోజు తెలంగాణ పోలీసులు అజీమ్ ఖాన్ ను అరెస్ట్ చేశారు.
క్రిప్టో కాయిన్ పేరుతో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగితో సహా 17 మంది నుంచి రూ.44 లక్షల రూపాయలు కాజేసి వారికి "24 నెలల్లో డబుల్ ఇస్తాం" అని నమ్మించి మోసం చేసినట్టు అభియోగం.
విశాఖ లో సంచలనం రికేత్తించిన జోయ్ జమీమా హనీ ట్రాప్ కేసు సృష్టి కర్త అయిన అజీమ్ ఖాన్ ఇప్పుడు తను తీసిన గోతిలో తనే పడ్డాడు.కొంతమంది పోలీసులతో చేతులు కలిపి అజీమ్ ఖాన్ ఎంతో మందిని అన్యాయంగా అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు తనే కటకటాల వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది