Current Date: 17 Jul, 2026

వన్డేలకు రోహిత్ శర్మ గుడ్‌బై? ఎల్లుండి లాస్ట్ మ్యాచ్‌కి స్పెషల్ గెస్ట్‌లు

లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో ఆదివారం జరగబోయే చివరి వన్డే మ్యాచ్.. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌లో ఆఖరిది కానుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ వర్గాలు. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని రోహిత్ ఆశిస్తున్నప్పటికీ, ఈ సిరీస్ ముగిసిన తర్వాత సెలక్షన్‌ కమిటీ అతడిని తదుపరి మ్యాచ్‌లకు ఎంపిక చేసే అవకాశం లేదని సమాచారం. ఈ మార్పునకు ప్రధాన కారణం యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్‌ అని బోర్డు అధికారులు చెబుతున్నారు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లోనే రెండు సెంచరీలు బాదిన జైస్వాల్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని జాతీయ సెలక్టర్లు గట్టిగా భావిస్తున్నారు. వచ్చే ప్రపంచకప్‌నకు ముందు భారత్ దాదాపు 20 వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మెగా టోర్నీ సమయానికి యశస్విని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలంటే, అతడికి ఈ మ్యాచ్‌ల్లో నిరంతరాయంగా అవకాశాలు కల్పించడం అవసరమని సెలక్టర్ల ఆలోచనగా ఉంది. దాంతో రోహిత్ శర్మకి డోర్స్ క్లోజ్ అవుతున్నాయి. రోహిత్‌ను జట్టు నుంచి బలవంతంగా తొలగించే ఉద్దేశం బోర్డుకు లేదని ఓ బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. రిటైర్మెంట్ ప్రకటించమని అతడికి ఎవరూ చెప్పరని, తన భవిష్యత్తుపై రోహిత్ శర్మ స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రోహిత్ శర్మ తన గత ఎనిమిది వన్డే మ్యాచ్‌ల్లో 30.1 సగటుతో కేవలం 241 పరుగులు మాత్రమే చేయడంతో.. ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే వన్డేలు,టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. కెరీర్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆదివారం ఆడబోతున్నారు. దాంతో మ్యాచ్‌ను వీక్షించేందుకు అతని తల్లిదండ్రులు కూడా లార్డ్స్‌కి చేరుకున్నారు.