Current Date: 17 Jul, 2026

శ్రీలీలకు ఛాన్స్‌లు మిస్.. వరుస ప్లాప్‌లతో ఐరెన్ లెగ్ ముద్ర!

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మూడేళ్ల పాటు వెలుగొందిన శ్రీలీల ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో ఆఫర్ల కోసం ఎదురుచూసే పరిస్థితికి చేరుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళం, బాలీవుడ్ వైపు దృష్టి సారించినప్పటికీ, అక్కడ కూడా ఆమెను దురదృష్టం వెంటాడుతోంది. ఇటీవల బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన అఖిల్ అక్కినేని 'లెనిన్', వంద కోట్ల వసూళ్లు సాధించిన 'అనగనగా ఒక రాజు' సినిమాల్లో మొదట శ్రీలీలనే హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ, చివరి నిమిషంలో ఆమెను పక్కనపెట్టి భాగ్యశ్రీ బోర్సే, మీనాక్షిలను ఎంపిక చేశారు. విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్', వరుణ్ ధావన్ బాలీవుడ్ మూవీ 'హై జవానీతో ఇష్క్ హోనా హై' సినిమాల నుంచి కూడా ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా ఒకే ఏడాది రెండు సూపర్ హిట్ సినిమాలతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లను ఆమె మిస్ చేసుకుంది. శివకార్తికేయన్ సరసన నటించిన 'పరాశక్తి' సినిమా డిజాస్టర్ కావడంతో, అజిత్ - ఆధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో వస్తున్న తమిళ సినిమాలో కూడా శ్రీలీలకు అవకాశం చేజారింది. ఆ  సినిమా ఫ్లాప్‌తో శ్రీలీలపై 'ఐరెన్ లెగ్' అనే ముద్ర పడటం కూడా అజిత్ సినిమా ఆఫర్ చేజారడానికి కారణమని తెలుస్తోంది.