Current Date: 26 Nov, 2024

నాగచైతన్య, శోభిత పెళ్లి తేదీ ఖరారు, అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే పెళ్లి!

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి వేడుకల గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఈ జంట నిశ్చితార్థం తరువాత ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో మెరిసింది. శోభిత ఇంట్లో అయితే పసుపు దంచి పెళ్లి కార్యక్రమాల్ని ప్రారంభించారు. అలానే పెళ్లికి సంబంధించిన షాపింగ్, ఇతరరత్రా ఏర్పాట్లను కానిచ్చేస్తున్నారు. పెళ్లికి సంబంధించిన డేట్, వేదిక గురించి తాజాగా సమాచారం బయటకు వచ్చింది. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి ఉంటుందని అంటున్నారు. అక్కడ మండపాన్ని సెట్ చేస్తున్నారట. అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరుగుతుందని అంటున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత రెండేళ్లు శోభితతో డేటింగ్‌లో ఉన్న నాగచైతన్య.. ఈ ఏడాది ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. కానీ.. నాగ చైతన్య గానీ శోభిత గానీ తమ ప్రేమ ప్రయాణం గురించి ఇంత వరకు ఎక్కడా ఎవ్వరికీ చెప్పలేదు. వచ్చే ఏడాది తండేల్ సినిమాతో నాగ చైతన్య  రాబోతున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తోంది.

Share