ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరగనుంది. ఈ భేటీలో వివిధ అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 11 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో .. ఈ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. దాంతో పూర్తి స్థాయి బడ్జెట్‌పైనా ఈ కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం.