పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్‌కి భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అడుగు దూరంలో ఉంది. ఉమెన్స్ 50 కేజీల విభాగంలో 5-0 తేడాతో క్యూబాకి చెందిన గుజ్మన్ లోపేజ్‌ను ఓడించిన వినేశ్ ఒలింపిక్స్ చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పింది.వాస్తవానికి వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ జర్నీ అంతా ఆటుపోట్లే కనిపిస్తాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో మోకాలి గాయంతో క్వార్టర్స్‌లోనే వెనుదిరగాల్సి వచ్చింది. అప్పట్లో కన్నీళ్లతో ఆమె స్ట్రెచర్‌పై ఇంటిబాట పట్టడం అందర్నీ కలచివేసింది. ఆ తర్వాత 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ క్వార్టర్స్‌లోనే ఓడిపోయింది. ఆ తర్వాత క్రమశిక్షణ ఉల్లంఘనతో నిషేధం, గతేడాది బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నందుకు ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైంది. దాంతో వినేశ్ పనైపోయిందనిఇక తిరిగి మ్యాట్‌పై పెట్టడం అసాధ్యమని అంతా అనుకున్నారు.కానీ సవాళ్లను దాటి అవిశ్రాంత కృషి, అంతులేని పోరాటంతో వినేశ్ ఫొగాట్ మ్యాట్‌పై సత్తాచాటి ఇప్పుడు పసిడికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇప్పుడు ఫైనల్లో గెలిస్తే గోల్డ్‌మెడల్, ఒకవేళ ఓడితే రజత పతకాన్ని ఆమె భారత్‌కి సగర్వంగా తీసుకురానుంది.
Share