వాళ్లు ఇద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ విషయం కాస్తా పెద్దలు తెలియడంతో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రేమికులు ఇద్దరూ సినిమాకి వెళ్లడంతో మొదలైన పంచాయతీ చివరికి ఆ ప్రేమికుడి ప్రాణం తీసింది.హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన కాకి సునీల్(22) డిగ్రీ వరకు చదివాడు. అక్కడే ఉన్న యువతి(21) అతను గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం ఇద్దరూ సినిమాకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న యువతి సోదరుడు వేణు కక్ష పెంచుకున్నాడు. తన స్నేహితులతో కలిసి వెళ్లి బీరు సీసాతో దాడి చేయడంతో సునీల్ తలకి గాయమైంది. చికిత్స అనంతరం యువకుడు ఇంటికి వచ్చాడు.మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో యువతిని వెంటబెట్టుకొని ఆమె సోదరులు, తల్లి రాజేశ్వరీ మరికొంతమంది వెళ్లి గొడవకు దిగారు. ‘నీది తక్కువ కులం నీకు మా చెల్లి కావాలా మళ్లీ తన జోలికొస్తే నీ అంతు చూస్తాం అంటూ యువకుడిని కొట్టారు దాంతో అవమానంగా భావించిన సునీల్ తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.