సాధారణంగా నీళ్లలో ఉండే ముసలి తెలంగాణలో వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలోని జానంపేటలో ఓ ఇంట్లోని బాత్‌రూములోకి దూరింది. అర్ధరాత్రి వీధి కుక్కలు గట్టిగా అరుస్తుండటంతో దొంగలు వచ్చారేమోనని గ్రామస్థులు లేచి చుట్టుపక్కల వెతికారు. కానీ.. ఎవరూ కనిపించకపోవడంతో ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లిపోయారు.నాగన్న అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లే ముందు బాత్‌రూములోకి వెళ్లగా అక్కడ పెద్ద మొసలి నక్కి ఉండటాన్ని చూసి భయంతో బయటికి పరుగులు తీశాడు. గ్రామస్థులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ సెక్షన్ అధికారిణి రాణి, స్థానిక పోలీసులు, స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్ బృందం తాళ్లతో ఆ మొసలిని బంధించి కృష్ణా నదిలో వదిలేశారు. ఆ మొసలి 90కిలోల బరువు, 8 అడుగుల పొడవున్నట్లు అధికారులు తెలిపారు.