Current Date: 05 Oct, 2024

ఐఐటీ మద్రాస్ చరిత్రలో అతిపెద్ద విరాళం

భారతదేశంలోని ఒక  విద్యా సంస్థకు ఇప్పటివరకు ఇచ్చిన అత్యంత పెద్ద విరాళం రూ. 228 కోట్ల రూపాయలను ఐఐటీ మద్రాస్ తన 'గౌరవప్రద పూర్వ విద్యార్థి' అవార్డు గ్రహీత డాక్టర్ కృష్ణ చివుకుల నుండి స్వీకరించింది. ఈ విరాళం ఐఐటీ మద్రాస్ చరిత్రలోనే అతిపెద్ద విరాళం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆగష్టు 6, 2024న క్యాంపస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఒక అకడమిక్ బ్లాక్‌ను గౌరవార్థం ‘కృష్ణ చివుకుల బ్లాక్’ గా పేరు మార్చారు. 1997లో డాక్టర్ కృష్ణ చివుకుల అమెరికాలో అప్పటికి తెర పైకొస్తున్న ‘మెటల్ ఇంజెక్షన్ మోల్డింగ్ (ఎంఐఎం )’ అనే అత్యాధునిక ఇంజనీరింగ్ తయారీ సాంకేతికతను భారతదేశానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన కంపెనీ, ఇండో యూఎస్  ఎంఐఎం  టెక్ , ప్రపంచంలో ఎంఐఎం  సాంకేతికతలో సామర్థ్యం మరియు అమ్మకాల పరంగా అగ్రస్థానంలో ఉంది, సుమారు రూ. 1,000 కోట్ల వరకు టర్నోవర్ సాధించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. 2015లో ఐఐటీ మద్రాస్ తన వృత్తి నైపుణ్యం, సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా డాక్టర్ కృష్ణ చివుకులకు ‘గౌరవప్రద పూర్వ విద్యార్థి అవార్డు’ ని అందించింది.

Share