Current Date: 05 Oct, 2024

అన్న క్యాంటీన్ల ప్రారంభానికి సన్నాహాలు - మంత్రి నారాయణ

ఈ నెల15న రాష్ట్రంలో తొలి విడత 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపల్‌ కమిషనర్లతో మంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్న క్యాంటన్ల ఏర్పాటు, డ్రైన్లలో పూడిక తొలగింపుపై కమిషనర్లకు పలు సూచనలు చేశారు. 33 మున్సిపాలిటీల్లో పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్న 100 క్యాంటీన్ల భవనాలు నిర్మాణం తీరును అడిగి తెలుసుకున్నారు. రాబోయే వారం రోజులు అన్న క్యాంటీన్ల ఏర్పాట్లపై కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. క్యాంటీన్‌ భవనాల్లో కిచెన్‌ ఏర్పాటు చేసే బృందాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, డైరెక్టర్‌ హరినారాయణన్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share