YS వివేకా కుమార్తె సునీత AP హోంమంత్రి అనితను కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు. వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసు సీబీఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి అనిత తెలిపారు.