Current Date: 05 Oct, 2024

భగవద్గీతపై వీడియో చేసి అడ్డంగా బుక్కైన బిత్తిరి సత్తి...


చేవెళ్ల రవి గురించి ఎవరికైనా తెలుసా? బిత్తిరి సత్తి అలియాస్ ఇస్మార్ట్ సత్తి తుపాకి రాముడు అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు. అంతలా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నాడు చేవెళ్ల రవి. అతని బిత్తిరి మాటలు, చేతలు జనాల్లోకి బాగా వెళ్లిపోవడంతో బిత్తిరి సత్తిగా స్థిరపడిపోయాడు. అయితే ఏది చేసినా ఇక చెల్లుతుందనుకున్నాడో ఏమో కానీ తాజాగా భగవద్డీతపై వీడియో చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భగవద్గీతను అనుకరిస్తూ తనదైన శైలిలో వ్యంగ్యంగా బిత్తిరి సత్తి స్కిట్ చేశాడు. దీనిపై నెటిజన్లు, మరోవైపు హిందూ సంఘాలు సైతం బిత్తిరి సత్తిపై మండి పడుతున్నాయి. వీడియో హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందంటూ సర్వత్రా బిత్తిరి సత్తిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకి వానర సేన అనే హిందూ సంఘం ఫిర్యాదు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నాయి.

Share