Current Date: 26 Nov, 2024

పవన్ కళ్యాణ్‌తో హోం మంత్రి అనిత భేటీ.. వివాదానికి తెర!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోస్టులు.. ఇలాంటి ఘటనలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఇటీవల పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను హోం మంత్రి పదవిని చేపడితే రాష్ట్రంలో పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. దాంతో వైసీపీ చేతికి అస్త్రం దొరికినట్లు అయ్యింది. గత 4 రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సెక్రటేరియట్‌లో పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి అనిత భేటీ అయ్యి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు, ఇతర అఘాయిత్యాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు చెప్పారు’’ అని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ట్వీట్ చేశారు.

Share