Current Date: 25 Nov, 2024

తెలంగాణలో కేటీఆర్ అరెస్ట్‌కి రంగం సిద్ధం? ట్రిమ్‌గా తిరిగొస్తాడట

హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్‌ నిర్వహణకు సంబంధించి నన్ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోందంటూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ‘‘కేసు పెడితే పెట్టుకో. రెండు నెలలు లోపల వేసి పైశాచిక ఆనందం పొందుతానంటే, జైలులో మంచిగా యోగా చేసి ట్రిమ్‌గా వస్తా. ఆ తర్వాత పాదయాత్ర చేస్తా. ఉడుత ఊపులకు బెదరం. రాజ్‌భవన్‌లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్‌ఎస్‌ను ఎలా ఖతం చేయాలని అనుకున్న మాట వాస్తవం’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ‘‘నా అరెస్టుకు గవర్నర్‌ అనుమతి ఇవ్వడం ఆయన విచక్షణకు సంబంధించిన అంశం. ఏ విచారణకైనా సిద్ధం. దేనికైనా రెడీగా ఉన్నా. ప్రజల తరఫున పోరాటం కొనసాగుతూనేఉంటుంది. ప్రజల దృష్టిని మళ్లించే ఆటలతో ఎక్కువ రోజులు తప్పించుకోలేవు.హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీ దెబ్బతీయకు. గాసిప్‌ పక్కన పెట్టి గవర్నెన్స్‌ మీద దృష్టి పెట్టు’’ అని కేటీఆర్ ఘాటుగా సూచించారు. ‘‘రేస్‌ నిర్వహణ ద్వారా హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీ పెంచేందుకు ప్రభుత్వం తరఫున రూ.55 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో అప్పటి హెచ్‌ఎండీఏ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ తప్పేమీ లేదు. ఫైల్‌పై నేనే సంతకం చేశా. రూ.55 కోట్లు చెల్లించమని నేనే చెప్పినందున నాదే బాధ్యత’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Share