కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీప దాస్ మున్షీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. వరుసగా పలువురు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీకి సంబంధించి వరంగల్లో భారీ సభకు కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.ఈ క్రమంలో వరంగల్ సభకు ఆహ్వానించారు.