ఐపీఎల్ 2025లో పరుగుల సునామితో ప్రత్యర్థి జట్లను బెదరగొడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి గురువారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ దడ పుట్టించేసింది. మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ పంత్ టాస్ గెలిచి.. హిట్టర్లతో నిండిన హైదరాబాద్‌ను ఫస్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అసలే సొంత మైదానం.. ఆపై ఫస్ట్ బ్యాటింగ్..దాంతో 300 స్కోరు పక్కా అని అంతా అంచనాలు వేశారు. కానీ.. లక్నో బౌలర్ శార్ధూల్ 4 వికెట్లతో హైదరాబాద్ నడ్డివిరిచి హైదరాబాద్ జట్టుని 190 పరుగులే పరిమితం చేశాడు. ఆ తర్వాత ఛేదనలో హైదరాబాద్ బౌలర్లని ఉతికారేసిన నికోలస్ పూరన్ కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70 పరుగులు చేసి 10 ఓవర్లలోపే మ్యాచ్‌ను హైదరాబాద్‌కి దూరం చేసేశాడు. ఉప్పల్‌లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో తేలిపోయిన హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి సీనియర్ హీరో వెంకటేశ్, అతని సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబుతో పాటు పలువురు సినీ, పొలిటికల్ సెలెబ్రిటీలు వచ్చారు.
Share