Current Date: 11 Oct, 2024

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై పేలిన డీజిల్‌ ట్యాంకర్‌

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై శుక్రవారం మధ్యాహ్నం డీజిల్‌ ట్యాంకర్‌ పేలిపోయింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు.  నల్గొండ జిల్లా చిట్యాలలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీపై ఉన్న డీజిల్‌ ట్యాంకర్‌ పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగా.. లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

Share