Current Date: 26 Nov, 2024

సోలార్ పవర్‌ స్కామ్ కేసులో జగన్‌ టార్గెట్ అయ్యారా..

ఏపీ ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్‌ను కొనడానికి 2021లో రూ.1750 కోట్ల లంచం ఇచ్చారని..ఈ వ్యవహారంలో అప్పటి ఏపీ సీఎం ఉన్నారని ప్రస్తావన వచ్చింది. దీని ఆధారంగా జగన్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టొచ్చా అన్న కోణంలో కూటమి ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరినట్లు తెలుస్తోంది. జగన్‌ను ప్రాసిక్యూట్‌ చేయడానికి గవర్నర్‌ అనుమతి కోరాలని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తోందట. అమెరికాలో కేసు.. దేశాన్ని ఊపేస్తున్న వ్యవహారం.. అపోజిషన్‌ నేతను టార్గెట్‌ చేస్తున్న తీరుతో.. సోలార్‌ పవర్ కొనుగోళ్ల కేసు ఓవర్‌ టు ఏపీ అయిపోయింది. దేశం మొత్తం అదానీ సెంట్రిక్‌గా చర్చ జరుగుతుంటే ఏపీలో మాత్రం జగన్‌ను కార్నర్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్‌ను ప్రాసిక్యూట్‌ చేసే అవకాశాలను పరిశీలిస్తోందట రాష్ట్ర ప్రభుత్వం. విద్యుత్‌ కొనుగోలు అగ్రిమెంట్‌ వ్యవహారంలో అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ కమిషన్‌ గౌతమ్‌ అదానీతో పాటు ఆయన సన్నిహితులపై కేసు పెట్టింది.

Share