Current Date: 26 Nov, 2024

బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తా.. ప్రభుత్వ సలహాదారు చాగంటి..

గతంలో ఇదే ప్రభుత్వ సలహాదారు పోస్ట్ ను 2014-19 మద్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇస్తే సున్నితంగా తిరస్కరించిన చాగంటి.. ఈసారి ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో స్వీకరిస్తానన్నారు. సుమతీ-వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్ధులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్‌తో చర్చించానన్న చాగంటి కోటేశ్వరావు ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తరువాత తొలిసారి సీఎం వద్దకు వచ్చారు. తన వద్దకు వచ్చిన చాగంటి కోటేశ్వరరావు యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటేశ్వరావును సీఎం శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు 

Share