బుక్కరాయసముద్రం, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ఓ ఇంట్లో కనబడకుండా పోయిన పది తులాల బంగారు ఆభరణాలు 15 రోజుల తర్వాత అదే ఇంటి పెరట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఆసక్తికర ఘటన అనంతపురం జిల్లా బుక్క రాయసముద్రం మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. వివరా లివీ.. బుక్కరాయసముద్రం పట్టణానికి చెందిన అనంతసాగరం శివప్ర సాద్, లక్ష్మి దంపతులు గత నెల 25న తాడిపత్రిలో జరిగిన ఓ పెళ్లికి వెళ్లారు. ఆ సమయంలో లక్ష్మి పది తులాల బంగారు ఆభరణాలను బీరు వాలో నుంచి తీసి ధరించారు. పెళ్లి ముగిశాక, మరుసటి రోజు తిరిగివచ్చి బీరువా పక్కనున్న కప్ బోర్డులో ఆభరణాలు ఉంచారు. ఈ నెల 4న బందు వుల వివాహం ఉండటంతో ఆభరణాల కోసం చూడగా కప్ బోర్డు ఖాళీగా ఉంది. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆ ఇంట్లో వేలిముద్రలు, ఇతర ఆధా రాలు సేకరించి, దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పెరట్లో శని వారం సాయంత్రం చెత్తను ఊడుస్తున్న లక్ష్మికి జాకెట్, బంగారం ఆభర ణాలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు వచ్చి పరిశీలించి, బాధితులకు ఆ బంగారాన్ని అప్పగించారు.