పశ్చిమ బెంగాల్‌లోని సల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్-షాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ వీక్లీ స్పెషల్ రైలులోను మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సౌత్-ఈస్ట్రన్ రైల్వే సీపీఆర్వో వెల్లడించారు. సల్పూర్ రైల్వే స్టేషన్ కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు మిడిల్ ట్రాక్ నుంచి వెలుపలి ట్రాక్‌కు మారుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన మూడు బోగీల్లో రెండు ప్రయాణికులవి కాగా, ఒకటి పార్సిన్ వ్యాన్ ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. పట్టాలు తప్పిన విషయం తెలియగానే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులను బస్సుల్లో కోల్‌కతాకు తరలిస్తున్నారు.
Share