రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకను బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, చీఫ్ సెక్రటరీ విజయానంద్, మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆశీర్వదించగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు కేక్ తినిపించి, బొకేలిచ్చి అభినందించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సీఎం, మంత్రుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపు కోవడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈ జన్మ దినం తనకు ప్రత్యేక సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తనను అభిమానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విజయవాడలోని మంత్రి నివాసంలో కూడా భార్య విజయమాధవి, కుటుంబ సభ్యుల సమక్షంలో అచ్చెన్నాయుడు కేక్ కట్ చేశారు.
Share