సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడానికి ఒక్క ఫోటో లేదా వీడియో చాలని మరోసారి నిరూపితమైంది. ఐరా రావత్ అనే టీమ్ ఇండియా అభిమాని విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఇటీవల వాంఖడే స్టేడియంలో భారత్-అమెరికా జట్ల మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లిన ఆమె, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కెమెరా కంటికి చిక్కి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఒక్క మ్యాచ్‌తో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మ్యాచ్‌కు వెళ్లకముందు ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 3 వేల మంది ఫాలోవర్లు ఉన్న ఐరా ఖాతాకు, మరుసటి రోజు ఉదయానికే ఏకంగా 3.5 లక్షల మంది ఫాలోవర్లు వచ్చి చేరారు. ఆమె స్టైలిష్ లుక్, స్టేడియంలో భారత్‌ను ఉత్సాహపరిచిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. డిజిటల్ క్రియేటర్‌గా ఉన్న ఐరా రావత్, భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి వీరాభిమాని. గతంలో ఒక సందర్భంలో 'చిన్నప్పుడు కోహ్లీని పెళ్లి చేసుకోవాలనుకున్నాను' అంటూ ఆమె చేసిన సరదా వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ఎంతగానో అభిమానించే ఐరా, ప్రస్తుతం సోషల్ మీడియాలో 'మిస్టరీ గర్ల్'గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Share