Current Date: 26 Nov, 2024

తెల్లవారితే పెళ్లి.. రాత్రి కట్నంతో వరుడు జంప్.. ట్విస్ట్ ఏంటంటే?

ఓ అమ్మాయిని ప్రేమించాడు. బతిమాలో బామాలో కుటుంబాలను ఒప్పించుకున్నాడు. ఇంకేముంది.. పెళ్లి అంతా సెట్టయింది. తెల్లారితే తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి.పెద్దల ఆశీర్వాదంతో తన ప్రియురాలి మెడలో తాళి కట్టాల్సిన ఆ ప్రియుడు.. ఊహించని షాక్ ఇచ్చాడు. రాత్రికి రాత్రే ఇంట్లో నుంచి జంపయ్యాడు. వరుడు.. వెళ్తూ.. వెళ్తూ.. పిల్లనిస్తున్న మామ ఆ పిల్లతో పాటు ఓ 10 లక్షల రూపాయలు కట్నంగా ముట్టజెప్తే.. వాటిని పట్టుకుని పరారయ్యాడు. ఈ ఘటన.. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో చోటుచేసుకుంది. సందీప్ రమేశ్ అనే యువకుడు.. ఓ యువతిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా సందీప్‌ని ఇష్టపడటంతో..కాళ్లా వేళ్లా పడి పెళ్లికి ఒప్పించుకున్నాడు. ప్రేమించిన పెళ్లి చేసుకుంటున్నప్పటికీ.. మెట్టినింట్లో కూతురు సంతోషంగా ఉండాలని ఆమె తండ్రి రూ.10 లక్షలు కట్నంగా ఇస్తానని ఒప్పుకున్నాడు. పెళ్లికి ముందే ఆ రూ.10 లక్షలు కాబోయే అల్లునికి ముట్టజెప్పాడు. కానీ.. అమ్మాయిని వదిలేసి ఆ డబ్బుతో అబ్బాయి జంప్ అయిపోయాడు. దాంతో పెళ్లికూతురు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Share