ప్రస్తుతం దేశం మొత్తం డిజిటల్ పేమెంట్స్ హవా నడుస్తోంది. ఇప్పుడు ఏటీఎంలకి వెళ్లి డబ్బులు డ్రా చేసే వారు చాలా తగ్గిపోయారు. అయినప్పటికీ.. కేవలం ఏటీఎంలలో నగదు విత్డ్రాలతోనే ఎస్బీఐ భారీగా ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే రూ.331 కోట్లు ఏటీఎంలలో విత్‌డ్రాల ద్వారానే వచ్చాయి. కానీ..అదే సమయంలో ఇతర బ్యాంకులు రూ.925 కోట్ల వరకూ నష్టాన్ని చవిచూసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటులో తెలిపింది. కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంకులకు మాత్రం ఎటీఎంల ద్వారా స్వల్పంగా లాభాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా 65వేలకు పైగా ఏటీఎంలను ఎస్బీఐ నిర్వహిస్తోంది. ఎటీఎంలలో తగినంత డబ్బు నిల్వ లేకపోవడం.. నిర్వహణ సరిగా లేకపోవడం కూడా ఆ నష్టాలకి మరో కారణంగా తెలుస్తోంది.
Share