ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా, ఓపెనర్ సంజు శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది టీ20 వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా అద్భుతంగా పోరాడింది. యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ 48 బంతుల్లో 105 పరుగులతో వీరోచితంగా ఆడి భారత్‌ను భయపెట్టాడు. ఒకానొక దశలో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మొగ్గుతున్నట్లు కనిపించినా, భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వారిని 246 పరుగుల వద్ద నిలువరించారు. ఈ హై-స్కోరింగ్ థ్రిల్లర్‌లో మొత్తం 499 పరుగులు నమోదయ్యాయి, ఇది టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్కే వలం 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు సంజు శాంసన్ ఇచ్చిన క్యాచ్‌ను ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వదిలేశాడు. ఆ తర్వాత శాంసన్ రెచ్చిపోయి ఆడి భారత్‌కు భారీ స్కోరు అందించాడు. హ్యారీ బ్రూక్ క్యాచ్‌ను అద్భుతమైన డైవ్‌తో అందుకోవడమే కాకుండా, బౌండరీ లైన్ వద్ద విల్ జాక్స్‌ను అవుట్ చేయడానికి అక్షర్ చేసిన 'రిలే క్యాచ్' మ్యాచ్ గమనాన్ని మార్చేశాయి. చివరి 3 ఓవర్లలో ఇంగ్లాండ్‌కు 45 పరుగులు అవసరమైన తరుణంలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అద్భుతమైన యార్కర్లతో కట్టడి చేశారు. చివరి ఓవర్ మొదటి బంతికే సెంచరీ హీరో బెథెల్ రనౌట్ అవ్వడం భారత్ విజయాన్ని ఖాయం చేసింది.
Share