Current Date: 04 Jul, 2024

జయహో భారత్‌ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం

దక్షిణాఫ్రికా చేయాల్సింది 24 బంతుల్లో 26 పరుగులే. అలాంటి స్థితిలో ఓ జట్టు ఓడిపోతుందని ఎవరైనా అనుకుంటారా! కానీ అద్భుతమే జరిగింది. ఓటమి కోరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది.ౖ మొదట భారత్‌ 7 వికెట్లకు 176 పరుగులే చేసింది. కోహ్లి (76), అక్షర్‌ (47) రాణించారు. ఛేదనలో హార్దిక్‌ (3/20), బుమ్రా (2/18), అర్ష్‌దీప్‌ (2/20) సూపర్‌ బౌలింగ్‌కు దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది.

Share