Current Date: 04 Jul, 2024

జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమలులోకి!

దేశవ్యాప్తంగా జూలై 1వతేదీ నుంచి కొత్త చట్టాలు అమలులోకి వస్తున్నాయి. కేంద్ర రూపొందించిన ఇండియన్ పీనల్ కోడ్‌లలో కొన్నింటిని సవరించి కొత్త కోడ్‌లతో సరికొత్త నిబంధనలతో రూపొందించి అమలకు సర్వం సిద్ధం చేశారు.శిక్ష కన్నా న్యాయం అందించడం ప్రధాన లక్ష్యమని ఈ చట్టాలు చెబుతున్నాయి. మూక హత్యను తొలిసారిగా నిర్వచించారు. వ్యవస్తీకృత నేరాలపై కొత్త అధ్యాయన్ని ప్రవేశ పెట్టారు.  వీడియో సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు చెల్లుబాటులోకి వస్తాయి.బ్రిటిష్ కాలంలో సుమారు 160 సంవత్సరాల నుండి  వస్తున్న పాత చట్టాలు ప్రస్తుతం సమాజ స్థితులకు అనుగుణంగా లేవని డాక్టర్ రణబీర్ సింగ్ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు భారత దేశ న్యాయ వ్యవస్థలో మార్పులు తీస్కొని రావడమే లక్ష్యంగా కేంద్రం నూతన చట్టాలు తీసుకొచ్చింది.ఐపీసీ1860 కి బదులుగా భారతీయ న్యాయ సంహిత 2023, సి.ఆర్.పి.సి.1973 బదులుగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, ఇండియన్ ఎవిడన్స్ యాక్ట్ 1872 బదులుగా భారతీయ సాక్ష్య అధినియం 2023 లు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకిబాధితులు పోలీస్ స్టేషనుకు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. 

Share