Current Date: 16 Nov, 2024

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 13కు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ  సమావేశాలు మొదటి రోజు బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన అనంతరం వెంటనే వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2024-2025 సంవత్సరాలకు గాను రూ.2.94 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ ను సభలో ప్రవేశ పెట్టారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రూ. 43,402 కోట్ల బడ్జెట్‌ ను అసెంబ్లీలోనే ప్రవేశ పెట్టి, ఎన్డీయే ప్రభుత్వం.. రైతులకు, వ్యవసాయానికి పెద్దపీట వేసిందని చెప్పారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ తెలిపారు. కాగా మంగళవారం ఏపీ అసెంబ్లీకి సెలవు ఇచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి కూటమి శాసనసభాపక్ష సమావేశం కానున్నారు.

Share