Current Date: 20 Jun, 2026

రోడ్డుపై ఉమ్మితే రూ.100 జరిమానా.. చెత్త వేస్తే రూ.200

పట్టణ ప్రాంతాల్లో పౌర పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సరికొత్త కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. బహిరంగ ప్రదేశాలు, రహదారులపై ఉమ్మివేయడం, విచక్షణ రహితంగా చెత్త వేయడం, మూత్ర విసర్జన చేయడం వంటి చర్యలను అరికట్టడానికి సెప్టెంబరు 1 నుంచి జరిమానాలు విధించనున్నట్లు రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి అగ్నిమిత్రా పాల్  ప్రకటించారు. మున్సిపల్ చట్టాల కింద అమలు చేసే ఈ జరిమానాలు రూ. 100 నుండి రూ. 200 వరకు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ నిబంధనల ప్రకారం, బహిరంగంగా ఉమ్మివేస్తే రూ. 100, అలాగే రోడ్లపై చెత్త వేసినా, నిషేధిత ప్లాస్టిక్‌ను ఉపయోగించినా, లేదా మూత్ర విసర్జన చేసినా రూ. 200 చొప్పున జరిమానా వసూలు చేస్తారు. దీనితో పాటు వ్యాపారస్తులకు కూడా మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. దుకాణదారులు తమ పరిసర ప్రాంతాల్లో చెత్తను కుమ్మరిస్తే వారికి కూడా ఈ జరిమానాలు తప్పవని స్పష్టం చేశారు. ఈ రూల్ దేశం మొత్తం వస్తే బాగుంటుంది కదా?